ఒకే ఒక్క విద్యార్థి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరీక్షా కేంద్రం చివరకు ఖాళీగా మారిన ఘటన Nagarkurnool districtలో చోటుచేసుకుంది.

ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాస్తున్న కమ్మరి వరుణ్ సందేశ్ అనే విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష రోజు ఆ విద్యార్థి హాజరు కాకపోవడంతో కేంద్రం ఖాళీగానే మిగిలింది.విద్యార్థి కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఐదుగురు సిబ్బంది విధుల్లో ఉండగా, పరీక్ష రాసేందుకు విద్యార్థి రాకపోవడంతో వారు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
