విజయవాడ (బీఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అజ్నాతంలో ఉన్న చిట్ట చివరి నాయకుడు చెన్నూరు నారాయణ తన దళంతో సహా లొంగిపోయాడు. 36 ఏళ్ళుగా ఏపీలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన చెన్నూరు నారాయణ ..
ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దళానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తో పాటు మరో 9 మంది నక్సలైట్స్ కూడా లొంగిపోయారు. దీంతో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్స్ అంతా ఖాళీ అయిపోయినట్లు భావిస్తున్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం తరపున అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని డీజీపీ హరీష్ గుప్తా తెలియచేశారు.
