TG:నిజామాబాద్‌లో ఇంటర్ ఫలితాలు.. 66.19% పాస్, గర్ల్స్ టాప్

April 13, 2026 12:44 PM

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా మంచి ఫలితాలను నమోదు చేసింది. రెండవ సంవత్సరం జనరల్ విభాగంలో 66.19% ఉత్తీర్ణత నమోదవగా, మొదటి సంవత్సరం 56.64% పాస్ శాతం నమోదైంది.

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, రెండవ సంవత్సరం జనరల్ విభాగంలో 13,876 మంది హాజరై 9,187 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 76.56% ఉత్తీర్ణతతో బాలురపై ఆధిపత్యం చాటగా, బాలురు 53.63% మాత్రమే సాధించారు.మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 15,547 మంది హాజరై 8,806 మంది పాస్ అయ్యారు. ఇందులో బాలికలు 67.36% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 42.98% మాత్రమే సాధించారు.ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరం 67.68%, మొదటి సంవత్సరం 49.69% ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో కూడా బాలికలు గణనీయమైన ఫలితాలు సాధించారు.గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. 2024-25లో రెండవ సంవత్సరం 58.21% ఉండగా, ఈసారి 66.19%కి పెరిగింది.మొత్తంగా జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బాలికలు మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media