తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీ ఎమ్ కే చీఫ్ డాక్టర్ ఎస్. రామదాస్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పడిపోయారు. అప్రమత్తమైన పార్టీ శ్రేణులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామదాస్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో సేలం ఆసుపత్రి వద్దకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. తమిళనాట ఈ మ్యాటర్ అలజడిగా మారింది.
