ఐపీఎల్ 2026 సీజన్ లో మొదటి విజయం నమోదు అయింది. బెంగళూరు జట్టు అదిరిపోయే ఆరంభం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియంలో సందడి చేశారు.
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. సుమారు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), రజత్ పటీదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌లు తోడవడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం అందుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80), చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) రాణించడంతో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, రొమారియో షెపర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మొత్తం మీద ఐ పీ ఎల్ జట్టు మొదటి విజయంతో సందడి చేసింది.
