ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా నిలిచిన Simhachalam Temple లో వార్షిక చందనోత్సవం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 20న జరగనున్న Chandanotsavam ఉత్సవానికి ముందుగా అప్పన్న స్వామివారికి తొలి విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవంలో, స్వామివారికి మూడు మనుగుల చందనం సమర్పించనున్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తూ ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
