‘అరైవ్–అలైవ్’ రోడ్ సేఫ్టీ డ్రైవ్ ప్రమాదాల నివారణపై SP నరసింహ

April 13, 2026 5:01 PM

ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ ‘అరైవ్–అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వారం రోజులపాటు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు.ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారితో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సీనియర్ సిటిజన్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు.రోడ్డు ప్రమాదాల వల్ల ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా ఉండాలనే లక్ష్యంతో అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media