అమెరికాలో వీసా విధానాల కఠినతరం కారణంగా వీసాల జారీ గణనీయంగా తగ్గింది. దీంతో భారత్, చైనా దేశాలకు చెందిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నివేదికల ప్రకారం 2025 తొలి ఎనిమిది నెలల్లో, 2024తో పోలిస్తే సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయి. మొత్తం వీసాల జారీలో 11 శాతం తగ్గుదల నమోదైంది. విద్యార్థి, ఉద్యోగ, కుటుంబ, పర్యాటక వీసాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.భారత్, చైనా దేశాలకు జారీ చేసే వీసాల్లో సుమారు 84 వేల తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా విద్యార్థి వీసాలు 30 శాతానికి పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ప్రయాణ ఆంక్షలు, సోషల్ మీడియా తనిఖీలు, సిబ్బంది కొరత వంటి కారణాలు ఈ తగ్గుదలకు దారితీశాయని అధికారులు పేర్కొన్నారు. వీసా అనేది హక్కు కాదని, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.మరోవైపు, ఈ ఆంక్షలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
