విప్స్ వ్యాలెట్ మోసం కేసు.. నల్లగొండలో 10 మంది అరెస్ట్

April 13, 2026 12:08 PM

అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై నల్లగొండ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

విప్స్ వ్యాలెట్ అధినేత వినోద్ తుకారాం ఖుటేతో పాటు 15 మంది పై కేసులు నమోదు కాగా, అందులో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 5 మంది, అందులో అధినేత కూడా ఉండగా, ప్రస్తుతం పరారీలో ఉన్నారని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే భారీ లాభాలతో పాటు పాత డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నల్లగొండలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో “WAVE” పేరుతో సమావేశం నిర్వహించగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అసాధ్యమైన లాభాల పేరుతో మోసం చేసే ఇలాంటి పథకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media