రాపూరులో కోతులు, కుక్కల హల్చల్ DPOకి సయ్యద్ సయీద్ వినతి

February 20, 2026 11:27 AM

రాపూరు పంచాయతీ పరిధిలో జనం కోతులు, కుక్కల సమస్యతో వణికిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాపూరు కొఆప్షన్ సభ్యులు సయ్యద్ సయీద్ నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి (DPO) వసుమతికి వినతిపత్రం అందజేశారు.

The current image has no alternative text. The file name is: WhatsApp-Image-2026-02-19-at-6.03.17-PM.jpeg

రాపూరులోని అన్ని గ్రామాల్లో కోతుల గుంపులు ఇళ్లపై పడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, ప్రజలపై దాడులు చేస్తున్నాయని ఆయన వివరించారు. అలాగే పిచ్చి కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన డి.పి.ఓ వసుమతి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media