AP:దాచేపల్లి అవగాహన సదస్సు IAS బాలలత

March 5, 2026 12:56 PM

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ, 10వ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత పాల్గొని విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలు, పోటీ పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 399వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎదిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, కష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. మరిన్ని విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగాలనే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి మార్గదర్శనం చేస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బాలలత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాఠశాల యాజమాన్యం అంబటి చంద్రశేఖర్, అంబటి నవ కుమార్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సదస్సుకు ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా హాజరయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media