మగ్గం మీద నేసిన వస్త్రాలనే కొనుగోలు చేస్తాం: మంత్రి S Savitha

March 6, 2026 10:42 AM

మగ్గం మీద నేసిన చేనేత వస్త్రాలనే APCO ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి S Savitha తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో ఆమె చర్చించారు.

ఈ సందర్భంగా మగ్గం మీద నేసిన రూ.1.40 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను అధికారులు కొనుగోలు చేశారు. పవర్ లూమ్ వస్త్రాలను ఇకపై ఆప్కో షోరూమ్‌లలో విక్రయించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media