Annamayya districtలో సీఆర్పీఎఫ్ జవాన్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. Peddathippasamudram మండలం రాపూరివారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ (40) Central Reserve Police Forceలో హెడ్ కానిస్టేబుల్‌గా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నారు.
పది రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చిన సురేష్ శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.సురేష్‌కు భార్య రెడ్డెమ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జవాన్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
