అన్నవరం సమీపంలో పులి సంచారం.. అప్రమత్తంగా అటవీ శాఖ

March 16, 2026 3:01 PM

Annavaram సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. Kakinada districtలోని శంఖవరం మండల పరిసరాల్లో గత రెండు మూడు రోజులుగా మన్యం పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

అచ్చంపేట – జి.కొత్తపల్లి గ్రామాల మధ్య సంచరించిన పులి ప్రస్తుతం శంఖవరం సమీపంలోని ఊరుకొండ కొండపై తిష్ట వేసిందని అధికారులు ధృవీకరించారు. సమీపంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులు బయట తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అటవీ శాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media