మగ్గం మీద నేసిన చేనేత వస్త్రాలనే APCO ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి S Savitha తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో ఆమె చర్చించారు.

ఈ సందర్భంగా మగ్గం మీద నేసిన రూ.1.40 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను అధికారులు కొనుగోలు చేశారు. పవర్ లూమ్ వస్త్రాలను ఇకపై ఆప్కో షోరూమ్‌లలో విక్రయించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
