గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు MLA వెనిగండ్ల రాము కీలక సమీక్ష నిర్వహించారు. వైద్యులు, అధికారులతో సమావేశమై ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, సమస్యలు, రికార్డులను పరిశీలించారు.
ఆసుపత్రికి సిటీ స్కాన్ మంజూరు అయ్యిందని, త్వరలో మరిన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఓపీ, ఐపీ, సర్జికల్ సేవల నిధుల విషయంలో వ్యత్యాసాలపై అధికారులను ప్రశ్నించి, సవరణలు చేయాలని సూచించారు.ఆసుపత్రి సెకండరీ కేటగిరీలో ఉండటం వల్ల ఐసీయూ వంటి సదుపాయాల మంజూరు ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు తాను పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, వాస్తవాలను ఆధారాలతో ప్రజలకు తెలియజేయాలని వైద్యులకు సూచించారు. బాధ్యతగా పనిచేసే వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
