విద్యార్థులతో ముచ్చటించిన హోం మంత్రి అనిత

March 5, 2026 1:57 PM

అమరావతి లోని రాష్ట్ర శాసనసభను ఈ రోజు 19 పాఠశాలలకు చెందిన మొత్తం 573 మంది విద్యార్థులు సందర్శించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు మరియు చట్టాల రూపకల్పనపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు 154 పాఠశాలలకు చెందిన 5,615 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభా కార్యక్రమాలపై విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నారు.సభ విరామ సమయంలో హోం మంత్రి అనిత విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media