సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ వివాదానికి దారి తీసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆమె కారుతో ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రమాదం జరిగిన అనంతరం ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సారీ చెప్పాలని గ్రామస్థులు కోరగా లావణ్య వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో లావణ్యపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ ఘటన సమయంలో కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనపై మరింత దర్యాప్తు చేపట్టారు.
