పాండ్రపాడులో పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్న సర్పంచ్

March 5, 2026 12:47 PM

గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాండ్రపాడులో పంచాయతీ కార్యదర్శి అమరేశ్వరరావును సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అడ్డుకున్నారు. గతంలో చేసిన పనుల బిల్లులు చేయడం లేదని సర్పంచ్ ఆరోపించారు. బిల్లులకు సంబంధించిన పుస్తకాలపై కార్యదర్శి సంతకం చేయడం లేదని కూడా తెలిపారు.

బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని కార్యదర్శి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కార్యదర్శిని తమ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డుకుని బైఠాయించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media