మొయినాబాద్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై ఏలూరు ఎంపీ Putta Mahesh Yadav స్పందించారు. వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
స్నేహితుడు డిన్నర్‌కు ఆహ్వానించడంతోనే Moinabadకు వెళ్లానని తెలిపారు. అక్కడ ఎటువంటి తప్పు చేయలేదని, తాను ఎలా ఉండే వ్యక్తినో ఏలూరు ప్రజలకు, స్నేహితులకు, పార్టీ నాయకులకు తెలుసని అన్నారు.ఈ ఘటనపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను నమ్మవద్దని కోరారు. త్వరలోనే ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
