రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య

March 5, 2026 2:45 PM

నెల్లూరు జిల్లా రాపూరు–చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ముత్తుకూరు ప్రాంతానికి చెందిన ఆలపాక ప్రసన్న (25) మరియు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చింతలతోపు గ్రామానికి చెందిన యాకసిరి సావిత్రి (24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని మృతిచెందారు.

పోలీసుల సమాచారం ప్రకారం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సావిత్రికి ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బాలు, కూల్ డ్రింక్ బాటిల్, హెల్మెట్ బాడీ స్ప్రే, అలాగే AP26BN6661 నంబర్ మోటార్ సైకిల్ లభ్యమయ్యాయి.మొదట విషం తాగి తర్వాత ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాపూరు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media