Vijayawada సిటీ మహిళా ఎస్ఐగా సేవలందించి ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి Vangalapudi Anitha ప్రశంసించారు. మంత్రి స్వయంగా మల్లేశ్వరి నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు.

మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలో పనిచేస్తూ 2024 ఎన్నికల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విషాదకరమని మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు.రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా కృషి చేసి, పోలీస్ కాంపెన్సేషన్ విభాగానికి మంచి పేరు తీసుకువచ్చారని మంత్రి అనిత తెలిపారు. మల్లేశ్వరి సేవలు పోలీస్ శాఖకు ఆదర్శమని కొనియాడారు.
