Samalkot టిడ్కో కాలనీలో నివసించే దాసరి దుర్గకు విద్యుత్ శాఖ నుంచి రూ.1.99 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆ టిడ్కో ఫ్లాట్‌లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీ బిల్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
దీనిపై బాధితులు స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించారు. కొత్త మీటర్ మార్పు సమయంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల భారీ బిల్లు జనరేట్ అయినట్లు తెలిపారు. అనంతరం బిల్లును సరిచేసి రూ.147 మాత్రమే చెల్లించాల్సిందిగా సవరించిన బిల్లును విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చారు.
