తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఇంద్రకీలాద్రి పై వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా దుర్గమ్మ ఉత్సవమూర్తిని వెండి రథంపై అధిష్టింపజేసి మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

మార్చి 19, 2026న ప్రారంభమయ్యే ఉగాది వేడుకల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. రథోత్సవం కోసం వెండి రథాన్ని శుద్ధి చేసి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు చేపట్టారు.
