ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. ఇటువంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాహన తయారీ సంస్థలు నిర్దేశించిన సైలెన్సర్లను మార్పు చేయడం వల్ల అధిక శబ్దం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, హృద్రోగులకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.గత ఆరు నెలల్లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 550 సైలెన్సర్లను తొలగించారు. అలాగే ప్రతి వాహనదారికి రూ.1500 చొప్పున జరిమానా విధించారు.తొలగించిన సైలెన్సర్లను మళ్లీ వినియోగించకుండా రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలు పాటించకపోతే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
