జిల్లా కోర్టును లక్ష్యంగా చేసుకుని మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. హనుమకొండ అదాలత్ పరిధిలోని కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తి బాంబ్ పెట్టామని మెయిల్ పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు.దాదాపు గంటపాటు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అనంతరం ఈ బెదిరింపు ఫేక్ అని అధికారులు తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు రావడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, మెయిల్ పంపిన అగంతకుడి కోసం దర్యాప్తు చేపట్టారు. కోర్టులను టార్గెట్ చేస్తున్నారా? లేక ఉద్దేశపూర్వకంగా భయాందోళన సృష్టిస్తున్నారా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
