మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని సూచించారు.గాయపడిన వారిని మెరుగైన ఆసుపత్రులకు తరలించి ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
