కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని పేరవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి తుని వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందున్న ట్రైలర్ లారీని ఢీకొట్టింది.
ఆటో అకస్మాత్తుగా అడ్డుగా రావడంతో ట్రైలర్ లారీ సడన్ బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిని 108 అంబులెన్స్ సాయంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు సడన్ బ్రేక్ కారణంగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ప్రమాదానికి ఆటో అడ్డుగా రావడమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.
