టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన సిరీస్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, నేడు విశాఖపట్నంలోని మధురవాడ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20లో కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తిరుగులేని ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ దిశగా మరో అడుగు వేయాలని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు భావిస్తోంది.సిరీస్ దక్కించుకోవడంతో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణాలకు విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమైన సంజూ శాంసన్ ఫామ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అతను రాణించడం కెరీర్ పరంగా కీలకం కానుంది.మ్యాచ్‌కు ముందు రోజు భారత క్రికెటర్లు విశాఖలోని థియేటర్లో ‘బార్డర్ 2’ సినిమా చూస్తూ రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. వైజాగ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
