ఆదిలాబాద్‌లో 37 సీసీటీవీ కెమెరాల ప్రారంభం SP అఖిల్ మహాజన్

March 5, 2026 3:21 PM

ఆదిలాబాద్ జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందజేసిన 37 సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీటీవీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, 24 గంటల పర్యవేక్షణతో నేరాలు, దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 250 కెమెరాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

నూతనంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, మహాలక్ష్మివాడ, రిమ్స్ ఆసుపత్రి ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలు, ప్రజలు కూడా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media