ఆంధ్రాలోని గోదావరి జిల్లాల నడిబొడ్డున ఉన్న ‘యానాం’లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. గోదావరి జిల్లా లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ… యానం మాత్రం పుదుచ్చేరిలో ఉంటుంది. స్వాతంత్ర్యానికి ఆంధ్రప్రదేశ్ అంతా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంటే, కేవలం యానం పట్టణం మాత్రం ఫ్రెంచ్ వాళ్ళ పాలనలో ఉండేది. స్వాతంత్రం తర్వాత యానాం ఆంధ్రప్రదేశ్ లో కలవలేదు. పుదుచ్చేరితో కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా ఉండిపోయింది. అందుచేత ఇక్కడ గురువారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ తలపడుతుండగా, బీజేపీ కూటమి తరపున మల్లాడి క్రిష్ణారావు తలపడుతున్నారు. పోటీ ఈ ఇద్దరి మధ్యనే బలంగా కనిపిస్తోంది.
