కలువాయిలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

March 18, 2026 2:54 PM

నెల్లూరు జిల్లా కలువాయిలోని వెలుగు కార్యాలయంలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

రాపూరు ఐసీడీఎస్ సీడీపీఓ సునంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, పోక్సో చట్టం, పౌష్ చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ మహిళలపై జరిగే వేధింపులు, గృహహింస, లైంగిక దాడులపై చట్టాలు కఠినంగా ఉన్నాయని, బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ పంచుకోకూడదని తెలిపారు. అలాగే ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్లపై వివరించి, సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, వైద్యులు, కౌన్సిలర్లు, మహిళలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media